క్యూలు కడుతున్న సందర్శకులు
సిరా న్యూస్,సికింద్రాబాద్;
97 ఎకరాలలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ప్రజల కోసం దాదాపు 20రకాల ఆకర్షణాలతో నిలయాన్ని తీర్చిదిద్దిరు.అధ్యంతం సందర్శకులకు అక్కట్టుకుంటుంన్నాయి. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజల కోసం చెక్కతో చేసిన 120అడుగుల ఫ్లాగ్ పోస్ట్, స్టెప్ వెల్, మ్యూజికల్ ఫౌంటైన్, చిల్డ్రన్ పార్క్,దక్షిణ మూర్తి( కొండను తొలిచి చెక్కరు) ఆలయాన్ని ప్రారంభించారు.
మరో ఆకర్షణ నక్షత్ర గార్డెన్, కిచెన్ టన్నెల్, చేర్యాల పెయింటింగ్స్,రాష్ట్రపతి నివాసం ఉండే గదులను ప్రజల కొరకు తెరిచారు.ఇది సందర్చించే వారికి ఉల్లాసంగా, అహ్లాదభరింతంగా ఉంటుందని ఎస్టేట్ మేనేజర్ రజనీప్రియ అన్నారు.
రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనార్ధం ఉదయం 10నుండి 5 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. 2023జూన్ నుండి నేటి వరకు ఒక్క లక్ష వరకు సందర్శకులు నిలయంకి వచ్చారు.
అదేవిధంగా ప్రభుత్వపాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం, వచ్చేవారికి 20 మంది గైడ్స్ వరకు రాష్ట్రపతి నిలయం గురించి వివరించడానికి అందుబాటులో ఉంటారు. ప్రాజెక్ట్, పరిశోదనల నిమిత్తం విద్యార్థుల కొరకు ఔషాద మొక్కల పార్కు కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు . దీనితో పిల్లకలకు ఉల్లాసంగా, ప్రకృతి నుండి నేర్చుకోవచ్చు. వీదేశీయులు కూడా అధిక సంఖ్యలో నిలయాన్ని సందర్శిస్తున్నారు.