బ్రేకులు ఫెయిల్..ఆర్టీసీ బస్సు బీభత్సం

సిరా న్యూస్,హైదరాబాద్;
హయత్ నగర్ పరిధి భాగ్యలత అయాన్ డిజిటల్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్ సుఖ్ నగర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందున్న ఆటోలు, బైక్లు, కార్లను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఓ ఆటోలోని మహిళ తల పగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. మరికొందరికి గాయాలవగా వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సు బ్రేక్ ఫెయిలైందని డ్రైవర్ అరిచాడని స్థానికులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *