స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు  భోగరాజు పట్టాభి సీతారామయ్య      

(సిరా న్యూస్);
-నేడు ఆయన జయంతి
స్వాతంత్ర్య సమరయోధుడిగా,  భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడిగా భోగరాజు పట్టాభి సీతారామయ్య  సేవలందించారు.   24 నవంబర్  1880 న మద్రాసు ప్రెసిడెన్సీరాష్ట్రములోని కృష్ణా జిల్లా ( పశ్చిమ గోదావరి జిల్లా, గుండుగొలను ) గ్రామములో జన్మించాడు . భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీ చే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడైకాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు. 1939లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ 1948లో పురుషోత్తమ దాస్ టాండన్ పై విజయం సాధించాడు.ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశాడు. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలుతెలుగులోనే జరగాలని సూచించాడు.పశ్చిమ గోదావరి జిల్లా గుండుకొలను గ్రామంలో 1880, నవంబర్ 24 న  బ్రాహ్మణుల ఇంటిలో పట్టాభి జన్మించాడు. వారి ఇంట్లో ప్రతి సంవత్సరం రామపట్టాభిషేకం
జరిపే ఆచారం ఉండేది. అందుకే తల్లిదండ్రులు పట్టాభి సీతారామయ్య అనే పేరు పెట్టినారు.ఇతని తండ్రి భోగరాజు వెంకట సుబ్రహ్మణ్యం పంతులు గుండుగొల్లు గ్రామ కరణంగా పనిచేసేవాడు. చదువు పూర్తైన తర్వాత మచిలీపట్నంలో డాక్టరుగా ప్రాక్టీసు పెట్టాడు కానీ లాభదాయకమైన సంపాదనను వదులుకొని గాంధీజీచే ప్రభావితుడై బ్రిటిషు వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యఉద్యమములో పాల్గొన్నాడు. తరువాతనే 1913లో బాపట్లలో తొలి ఆంధ్రమహాసభ జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకత గురించి పట్టాభి ఆంగ్లంలో ఒక గ్రంథమే రచించాడు. పట్టాభి కృషి వల్లనే 1920లో కాంగ్రెసు పార్టీ ఆంధ్ర రాష్ట్రఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదించింది.పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించాడు. ఆంధ్రా బ్యాంకు (1923లో స్థాపన), ఆంధ్రా ఇన్స్యూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణాకో-ఆపరేటివ్ బ్యాంకు మొదలగునవి స్థాపించాడు. ఆంధ్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు. చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపునుప్రోత్సహించాడు.ఇతడు 1919లో మచిలీపట్నం నుండి జన్మభూమి అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించాడు. ఆ కాలంలో ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాలలో ఆంధ్రుల సంపాదకత్వంలో వెలువడే ఆంగ్ల పత్రికలు లేవు. ఆకొరతను తీర్చడానికి ఇతడు జన్మభూమిని ప్రారంభించాడు. ఈ పత్రిక ఇతని సంపాదకత్వంలో 1930 వరకు వెలువడింది. ఈ పత్రికలోని సంపాదకీయ వ్యాసాలు ఇతని ఆంగ్లభాషా నైపుణ్యాన్ని దేశానికిచాటింది. నాటి త్రయం పట్తాభి రామయ్య, కొంపెల్ల హనుమంతరావు, ముట్నూరు కృష్ణారావు  త్రయం 1902లో కృష్ణాపత్రికను స్థాపించారు.స్వాతంత్ర్యం తరువాత 1948లో కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటీలో నెగ్గిపీఠాన్ని అధిష్టించాడు. ఆ తరువాత 1952లో రాజ్యసభ  సభ్యునిగా ఎన్నికై  పార్లమెంటులో ప్రవేశించాడు. 1952 నుండి 1957 వరకు     మధ్యప్రదేశ్ గవర్నరుగా పనిచేశాడు. తెలుగు ప్రజలకు ఎంతగానోతోడ్పాటు అందించిన పట్టాభి 1959, డిసెంబర్ 17న స్వర్గస్థుడయ్యాడు.వీరి గౌరవార్దం 17 -12-1997 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *