విజయవాడ,(సిరా న్యూస్);
శాంతినగర్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను నున్న పోలీసులు అరెస్ట్ చేశారు. అజిత్ సింగ్ నగర్ కు చెందిన ఎస్ సందీప్, షేక్ అమీర్ లు స్థానికంగా గంజాయి విక్రయిస్తున్నట్లుటాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. యువకులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారి వద్ద నుంచి 2.140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని నున్న పోలీసులకుఅప్పగించారు.