జనసేన నేతల నిరసన
సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి నగరంలో అనేక చోట్ల అధికార పార్టీ ఏర్పాటు చేసిన సిద్ధం అనే హోర్డింగ్ లకు వెంటనే తొలగించాలని కోరుతూ తిరుపతి జనసేన నాయకులు మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సిద్ధం అనే హోల్డింగ్ లు ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. గుడులు, పాఠశాలలపై సైతం ఏర్పాటు చేయడాన్ని తప్పు పట్టారు. ఆ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ జగన్ ఎన్నికలకు సిద్ధమా లేదా ఇంటికి వెళ్లడానికి సిద్ధమా లేదా తిరిగి ప్రజలను వంచించడానికి సిద్ధమా చెప్పాలన్నారు. నగరంలో 100కు పైగా హోర్డింగులను ఏర్పాటు చేశారని ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటుచేసిన హోర్డింగులకు చలానాలు ఇచ్చారా, వీటికి డబ్బులు ఎవరు చెల్లించారో చెప్పాలని నిలదీశారు. లేని పక్షంలో తాము కూడా సవాల్ అంటూ హోర్డింగ్లను ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.