పోటాపోటీగా మూడు పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటు
సిరా న్యూస్,కోనసీమ;
అంబెడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసారు. మూడు పార్టీల నేతలు అంబాజిపేట నాలుగు రోడ్ల సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడంతో వివాదాలు తలెత్తాయి. జనసేన, వైసీపీ, టీడీపీ నేతలు ఒకే చోట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. పి.గన్నవరం నియోజకవర్గ వైసీపీ కొత్త ఇంచార్జి విప్పర్తి వేణుగోపాల్ సిద్ధం పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా, సిద్ధం ఫ్లెక్సీ కి ఇరువైపులా జనసేన, టీడీపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. జనసేన మేము సిద్ధమే అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు, టీడీపీ సంసిద్ధం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసారు. టీడీపీ, జనసేన కలిసి ఉన్నప్పటికీ రెండు పార్టీల నేతలు విడివిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. జిల్లాలో రోజు రోజుకు ఫ్లెక్సీల రగడ పెరుగుతోంది. ఒకరి స్లోగన్ సిద్ధం, ఇంకొకరి స్లోగన్ మేము సిద్ధమే ,,మరొకరి స్లోగన్ సంసిద్ధం. జనాలు అయోమయం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కోనసీమ చాలా సెన్సిటివ్ ప్రాంతం కావడంతో ఫ్లెక్సీల రగడ ఎక్కడకు దారితీస్తోందో అని జనాలు ఆందోళన చెందుతున్నారు.