సిరా న్యూస్,ఆత్మకూరు;
నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం అల్లీపురం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, స్థానిక టీడీపి నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక అల్లీపురం గ్రామానికి చెందిన కార్యకర్త కముజుల ఆంజనేయ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో భువనేశ్వరి ఆయన కుటుంబ సభ్యులను కలసి ఓదార్చి, ధైర్యం చెప్పారు. కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్ధికసాయం చేశారు. కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.