సిరా న్యూస్,తిరుమల;
హిందూయేతర భక్తులకు ఆఫ్ లైన్ లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి భక్తులు వేచిఉండే సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం. కాంప్లెక్స్, క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా టైంస్లాట్ విధానాన్ని మరింత పెంచాలని యోచనలో వున్నామని అన్నారు.
తిరుమలలో ప్రవేటు ఆహార విక్రయకేంద్రాల్లో ఎల్పీజీ గ్యాస్ స్టవ్ లు క్రమంగా నియంత్రిస్తాం. త్వరలో ఎల్ఎన్జీ స్టేషన్ ను ఏర్పాటు చేసి, పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తాం. అగ్నిప్రమాదాలను నివారించేందుకే ఈ చర్యలని అన్నారు. ఫిబ్రవరి 16న రథసప్తమిని వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. ఒకేరోజు మలయప్పస్వామి సూర్యప్రభ మొదలు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం వుంటుంది. మాడ వీధుల్లో ఉండే భక్తులకు పాలు, అల్పాహారం పంపిణీ కి చర్యలు తీసుకున్నాం. శనివారం నుంచి మూడ్రోజుల పాటు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నాం. 57 మంది పీఠాధిపతుల సలహాలు, సూచనలు తీసుకొని హిందూ ధర్మ ప్రచారం మరింత విస్త్రుతంగా చేస్తామని అన్నారు.