సిరా న్యూస్,శ్రీశైలం;
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర,సంస్కృతి,పురావస్తు శాస్త్ర పీఠం శ్రీశైలం ప్రాంగణం పీఠాధిపతి డా. ముసుగు శ్రీనివాసరావు గారు మరియు ప్రాంగణం సిబ్బంది శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు గారిని శనివారం రోజు మర్యాదపూర్వకంగా కలసి దుశ్యాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ క్యాలెండర్ ను కార్యనిర్వాహణాధికారి డి. పెద్దిరాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పీఠాధిపతి డా. ముసుగు శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.ఇ, శోభన్ బాబు, డా.డి, విశ్వనాధ శాస్త్రి, లైబ్రేరీయన్ డా. పి మురళీధర్ రెడ్డి,జూనియర్ అసిస్టెంట్ సి.రమేష్ బాబు,వర్క్ ఇన్స్పెక్టర్ కె,బాబు పాల్గొన్నారు.