– శాసన సభ్యులు చింతకుంట విజయరమణారావు
సిరా న్యూస్,పెద్దపల్లి;
జిల్లాలోని ఫోటో గ్రాఫర్ ల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. స్థానిక నందన గార్డెన్ లో పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫోటోగ్రాఫర్ల మేళాకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల సౌకర్యార్థం ఫోటో భవ నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. 15 రోజుల్లోనే 10లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమం, అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూరాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లకు కుటుంబ భరోసా పథకం ద్వారా అండగా ఉంటున్నామని అన్నారు. కుటుంబ భరోసా ద్వారా మరణించిన ఫోటో గ్రాఫర్ల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందిస్తున్నా మని అన్నారు.
ఫోటో టెక్ చీప్ అభిమన్యు రెడ్డి మాట్లాడుతూ ఫోటో గ్రాఫర్లు వృత్తిలో ఖర్చు చేసే ప్రతి రూపాయి మీద డిస్కౌంట్ లభిస్తుందని, జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లకుకెనాన్ మెంటర్ భూపాల్ కెమెరాల పై,నూతన టెక్నాలజీ లో మెళుకువలు నేర్పించారు. అనంతరం మోడల్ షూట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్, ప్రధాన కార్యదర్శిపోగుల విజయకుమార్, కోశాధికారి వనపర్తి శ్రీనివాస్, ఫోటోటెక్ టీం ఓం ప్రకాష్, జూలూరి మధు,జిలా కార్యవర్గ సభ్యులు, 14 మండలాల అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి లతో అధిక సంఖ్యలోఫోటో వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు