బద్వేలు అసెంబ్లీ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్ష కానున్నాయా ?

సంక్షేమ పథకాలు అభివృద్ధి నమ్ముకున్న వైకాపా

ప్రజా బలాన్ని నమ్ముకున్న తెలుగుదేశం

మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వైకాపా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి పైనే అంతా భారం

వైకాపాలో ముదిరిన అసమ్మతి

బద్వేలు;
త్వరలో జరగబోయే బద్వేలు అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీలకు అగ్ని పరీక్షగా మారబోతున్నాయి ఇదే విషయాన్ని రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు గంట పదంగా బల్ల గుద్ది మరి మరి చెబుతున్నారు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆశామాషి వ్యవహారం కాదని ప్రజల నాడీ పట్టుకొని బర్లోకి దిగితే తప్ప విజయం అంతా సులువు కాదని అంటున్నారు పార్టీ అధినేతలు క్షేత్రస్థాయిలో చేస్తున్న రహస్య సర్వే రెండు పార్టీలపై ప్రభావం చూప బోతుంది . ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ చాలా రోజులుగా సర్వశక్తులు ఒద్దుతుంది అలాగే వైకాపా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు చాలా చురుకుగా ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు వైకాపా పార్టీ మాజీ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి చెప్పిన వారికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ టికెట్ ఇస్తారనేది అందరికీ తెలిసిన విషయం గతంలో కూడా గోవింద్ రెడ్డి చెప్పిన వారికే వైకాపా బద్వేల్ అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చిన వారిని గోవింద్ రెడ్డి ముందుండి గెలిపించుకున్నారు గోవింద్ రెడ్డి రాజకీయ కోణం మరో విధంగా ఉంటుంది అభ్యర్థి గెలుపే ధ్యేయంగా ఆయన దూసుకు పోతుంటారు గోవిందరెడ్డి రాజకీయాలకు అతీతంగా మంచి పేరు ఉంది చిన్న పెద్ద అన్నా తేడా లేకుండా అందరిని గౌరవిస్తారు ఇది ఆయనకు ప్లస్ పాయింట్ ఇక తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ కొన్ని చీడ పురుగులు ఉన్నాయి ఆ చీడపురుగులు ఎవరి నీది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఆ చీడ పురుగులను పార్టీ ముఖ్య నాయకులు దూరం పెట్టలేక పోతున్నారు కనీసం పది ఓట్లు తెచ్చే శక్తి కూడా ఆ చీడపురుగులకు ఎంత మాత్రం లేదని చెప్పాలి ఇదే విషయాన్ని రాజకీయ పరిశీలకులు కూడా మరి మరి చెబుతున్నారు కేవలం కొందరి ఉపయోగాలు చూసే ఆ చీడపురుగులు తెలుగుదేశం పార్టీకి మొదటినుంచి చేటు తెస్తున్నాయి బద్వేల్ అసెంబ్లీ రిజర్వ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క ఎన్నికల్లో విజయం సాధించక పోవడానికి చాలావరకు ఆ చీడ పురుగులే కారణమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు
జరిగే ఎన్నికల్లో తిరిగి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు దృష్టి పెట్టవలసి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *