సనత్ నగర్,(సిరా న్యూస్);
సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం రాంగోపాల్ పేట డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వర్షంలోను మంత్రి తలసాని ప్రచారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే పార్టీలను నమ్మొద్దు… మరోసారి గోస పడొద్దని అన్నారు.