సిరా న్యూస్,భద్రాచలం;
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కాంగ్రెస్ నేత బలరాం నాయక్ మండిపడ్డారు. అరె.. సుమన్ నువ్వు ఒక చెప్పు చూపిస్తే పది చెప్పులతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. అదే చెప్పులతో నీ మెడలో వేసి ఊరేగిస్తాం. చిల్లర రాజకీయాలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి పై నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. లేదంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు.ఆనాడు పార్లమెంట్ లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎంపిలం కొట్లడినం… ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు పార్లమెంట్ లో మీ కేసిఆర్ లేడు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే మీ బ్రతుకులు ఏమిటో తెలుసుకోవాలని గుర్తు చేశారు.