కరీంనగర్ లో ఎలుగు బంటి హల్చల్

సిరా న్యూస్,కరీంనగర్;
మంగళవారం ఉదయం మానకొండూరు పట్టణంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. . చెరువు కట్ట వద్ద ఓ ఇంటి అవరణలో ఉన్న చెట్టుపై ఎలుగుబంటి కూర్చొని ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఎలుగు బంటిని పట్టుకోవడానికి రంగం సిద్దం చేసారు. స్థానికులను ఇంట్లోనుంచి బయటకు రాకుండా ఉండాలని కోరారు.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *