సిరా న్యూస్,అనకాపల్లి;
అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం గోలగాం పంచాయతీ సెక్రెటరీ కన్నబాబు 7000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి ఇంటి పన్నుకి పేరు మార్పిడికి సంబంధించి కన్నబాబు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం గొలగం పంచాయతీ కార్యాలయంలో బాధితుడు నుంచి కన్నబాబు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు