సిరా న్యూస్, ఆదిలాబాద్:
సంగెం ట్రస్ట్ ఆధ్వర్యంలో కోర్టు ఉద్యోగి శ్రీనివాస్ కు ఘన సన్మానం…
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న ఆదిలాబాద్ కోర్టు ఉద్యోగి పట్టపు శ్రీనివాస్ ను సంగెం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సంగెం సుధీర్ కుమార్ ఘనంగా సన్మానించారు. బుధవారం కోర్టు కార్యాలయంలో ఇతర అధికారులతో కలిసి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంగెం సుధీర్ కుమార్ మాట్లాడుతూ… కోర్టు ఉద్యోగి శ్రీనివాస్ జనవరి 26న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ సంజయ్ కుమార్, స్టేనో శ్రీ మల్లారెడ్డి, కోర్ట్ ఉద్యోగి నవనీత్, తదితరులు ఉన్నారు.