Sira Effect: సిరా న్యూస్ ఎఫెక్ట్… బొమ్మనపల్లిలో చేతి పంపుకు మరమత్తులు

సిరా న్యూస్, చిగురుమామిడి:

సిరా న్యూస్ ఎఫెక్ట్… బొమ్మనపల్లిలో చేతి పంపుకు మరమత్తులు
+ సిరా న్యూస్ కథనానికి స్పందించిన ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు
+ 12 వ వార్డులో కొత్త హ్యాండ్ పంప్ బిగింపు
+ సిరా న్యూస్ పత్రికకు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు

జనవరి 9 న సిరా న్యూస్ లో కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం “బొమ్మనపల్లిలో తాగునీటి కష్టాలు” శీర్షికన ప్రచురితమైన కథనానికి మండల ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు స్పందించారు. గురువారం అధికారులు గ్రామానికి చేరుకుని 12 వ వార్డులో చేతి పంపుకు మరమ్మత్తులు చేసి, కొత్త హ్యాండ్ పంప్ ను బిగించారు. ఏళ్లుగా తమ వార్డులో తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని, సిరా న్యూస్ కథానికి స్పందించిన అధికారులు చేతి పంపు బిగించడం సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా సిరా న్యూస్ కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *