ప్రాణ రక్షణ ఎంతో ముఖ్యం

వాహనదారులు అతి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి

సీటు బెల్టు హెల్మెట్ తప్పనిసరి

కడప జిల్లా డిటిసి మీరా ప్రసాద్

బద్వేలు అర్బన్ సీఐ యుగంధర్

బద్వేలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ రావు

సిరా న్యూస్,బద్వేలు;
ప్రాణ రక్షణ ఎంతో ముఖ్యం వాహనదారులు ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా అతి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి సీట్ బెల్ట్ హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలి నిర్లక్ష్య డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం అని కడప జిల్లా డిటిసి మీరా ప్రసాద్ బద్వేలు అర్బన్ సీఐ యుగంధర్ బద్వేల్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ రావు అన్నారు శుక్రవారం బద్వేలు మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఆవరణలో యువ శక్తి ద్వారా సామాజిక మార్పు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు సమావేశంలో వీరితోపాటు బద్వేలు ఆర్టిసి మేనేజర్ శ్రీనివాసరావు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ రాంప్రసాద్ బద్వేలు మండల విద్యాశాఖ అధికారి చెన్నయ్య అతిథులుగా వచ్చారు ఈ సందర్భంగా వారు వేరు వేరుగా మాట్లాడుతూ సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాహనాలు నడుపుతున్నారని వాహనాలు నడిపేప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు గత ఏడాది కడప జిల్లాలో 300 పైగా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం మరి కొంతమంది గాయాల పాలు కావడం జరిగిందన్నారు అన్ని శాఖల అధికారులు రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు అనేక సమావేశాల ద్వారా చైతన్యం కల్పిస్తున్న చాలామంది పాత పద్ధతులను ఆలంబిస్తున్నారని వారు ఆవేదన చెందారు రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి ఎంత నష్టమో వారు ఉదాహరణతో వివరించారు డ్రైవింగ్ చేసేవారు సరైన వయసు కూడా లేకుండా వాహనాలు నిర్లక్ష్యంగా నడుపుతున్నారని తెలిపారు ఎప్పటికప్పుడు తాము చర్యలు తీసుకుంటున్న యువతలో ఏమాత్రం మార్పు రావడంలేదని వారు ఆవేదన వ్యక్తపరిచారు తల్లిదండ్రులు చెప్పిన మాట విని నడుచుకోవాలని కోరారు సమావేశంలో పాల్గొన్న ప్రతి అధికారి డ్రైవింగ్ పై పలు సూచనలు జాగ్రత్తలు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *