కుందుర్తి, సిరా న్యూస్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కుందుర్పిలో సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. స్థానిక కట్టెల డిపో వద్ద ఒక యువకుడి కంట్లో కారం కొట్టి అతడి వద్ద ఉన్న రూ. 26 వేలు దుండగులు ఎత్తుకెళ్లారు. కళ్లల్లో కారం కొట్టడంతో అతడికి ఏం కనిపించలేదు. దీంతో సందట్లో సడేమియాలాగా వారి పని కానిచ్చేశారు. తన డబ్బులు పట్టుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.