సిరా న్యూస్,ములుగు;
మేడారంలో శుక్రవారం ఆర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో ఉన్న స్థానిక చిరు వ్యాపారుల షాప్ లను అధికారులు కూలగోట్టారు. అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని మేడారం గ్రామ చిరు వ్యాపారులు నిరసన వ్యక్తం చేసారు. మంత్రి సితక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు. ప్రభుత్వం వైఖరిపై మేడారం గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. న్యాయం చేయాలంటూ ఆందోళనలకు దిగారు.