సిరా న్యూస్,నందిగామ;
బదిలీపై డోన్ వెళ్తున్న నందిగామ పురపాలక సంఘం పూర్వపు కమిషనర్ డాక్టర్.యస్. జయరామ్ కు ప్రజలు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. శనివారం శ్రీకరం ఫంక్షన్ హాల్లో జరిగిన వీడ్కోలు సభలో ప్రస్తుత కమిషనర్ హేమమాలిని, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉద్యోగులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ అభివృద్ధిలో కమిషనర్ జయరాం పాత్ర కీలకమని.. ఎన్ని అవరోధాలు వచ్చినా భయపడే వాడు కాదని అన్నారు.
ప్రతిపక్షాలు వ్యక్తిగతంగా దూషించిన పట్టించుకోకుండా పట్టణ అభివృద్ధి పైనే దృష్టి నిలిపాడని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన రావు కొనియాడారు. ఈ సందర్బంగా పూర్వపు కమిషనర్ జయరామ్ ను, ప్రస్తుత కమిషనర్ హేమమాలిని నీ.. ఘనంగా సన్మానించారు.