సిరా న్యూస్, కుందుర్పి
*జిల్లా ఎస్పీని కలిసిన ఏఆర్ నూతన అదనపు ఎస్పీ
జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ని ఏ.ఆర్ విభాగం నూతన అదనపు ఎస్పీ ఎస్ లక్ష్మినారాయణరెడ్డి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకు మునుపు జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీగా తన చాంబర్లో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 1992 బ్యాచ్ నకు చెందిన ఈయన వివిధ హోదాలలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, తిరుపతి జిల్లాలలో కూడా పని చేశారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్, జాఫర్ (రాష్ట్ర సభ్యులు), సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్ మసూద్ లు ఏ.ఆర్ అదనపు ఎస్పీనీ కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.