బంధువుల అందోళన
సిరా న్యూస్,గాజువాక;
విశాఖ జిల్లా ఆదాని గంగవరం పోర్టు కార్మికుడు గండేపల్లి అప్పారావు (43) కడుపు నొప్పితో అనారోగ్యంతో చనిపోయాడు. మృతదేహంతో అప్పారావు బంధువులు అదాని గంగవరం పోర్టు గేటు వద్ద నిరసన తెలిపారు. భారతదేశంలో ఉన్న అన్ని కంపెనీ లోను ఒక ఆసుపత్రి ఉంటుందని, కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు కార్మిక కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందిస్తారని, కానీ ఇక్కడ అదా నీ గంగవరం పోర్ట్ కు సంబంధించి ఎటువంటి ఆసుపత్రి లేదని అన్నారు. దీనివల్ల గంగవరం పోర్ట్ నుంచి వస్తున్న కాలుష్యం వలన గంగవరం గ్రామంస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని, గంగవరం గ్రామస్తులు భూములు ఇచ్చి, సముద్రాన్ని ఇచ్చి జీవితాలు త్యాగం చేస్తే చాలీచాలని జీతాలతో మా బ్రతుకులతో ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యం ఆడుకుంటుందని, ఎన్నిసార్లు ధర్నాలు చేసిన పట్టించుకోవడంలేదని, వాపోయారు. వెంటనే యాజమాన్యం స్పందించి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని అన్నారు.