నా తప్పు లేదు..

విశాఖపట్నం,(సిరా న్యూస్);
విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదంలో బోట్లు దగ్ధమైన ఘటనలో పోలీసులకు ఎటువంటి క్లూస్ లభించలేదు. ప్రస్తుతం వాసుపల్లి నాని, అల్లిపిల్లి సత్యం అనే ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాసుపల్లి నాని ఫిషింగ్ హార్బర్ లో కొన్ని బోట్లకు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. సత్యం అక్కడ వంటచేసే వాడిగా చెబుతున్నారు. సత్యం వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం జరిగి ఉండే అవకాశం లేకపోలేదన్న కోణంలోనూ విచారణ జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది. కాగా ఈ ప్రమాదంలో తొలుత అభియోగాలు ఎదుర్కొన్న లోకల్ బాయ్ నానిని గురువారం సాయంత్రం వదిలేశారు పోలీసులు. విడుదల అనంతరం బీజేపీ ఎంపీ జీవీఎల్ను కలిసి తను తప్పు చేయలేదంటూ అవేదన వ్యక్తం చేశాడు నాని. నానిపై ఆధారాలు లేకుంటే ఎందుకు ఇల్లీగల్ కస్టడీలో ఉంచుకున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు జీవీఎల్.మరోవైపు ఏపి హైకోర్టులో గురువారంహెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు యూట్యూబర్ నాని కుటుంబ సభ్యులు. అగ్ని ప్రమాదం ఘటనపై ప్రమేయం లేనప్పటికీ.. నానిని పోలీసులు అదుపులో ఉంచుకున్నారంటూ.. కోర్టులో పిటిషన్ వేయడంతో.. అలెర్టయిన పోలీసులు.. నానిని విడుదల చేశారు. అయితే తన పరువుకు నష్టం కలిగించేలా పోలీసులు వ్యవహరించాని.. 20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు నాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *