సిరా న్యూస్, కరీంనగర్
ఐదేళ్ల లోపు చిన్నారులకు విటమిన్ ఏ ఎంతో అవసరం
*ఆశ అంగన్వాడీ కార్యకర్తలు
తొమ్మిది నెలల నుండి ఐదేళ్ళ లోపు చిన్నారులకు విటమిన్ ఏ ఎంతో అవసరమని ఆశ అంగన్వాడీ కార్యకర్తలు అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అంగన్ వాడి కేంద్రాల్లో తొమ్మిది సంవత్సరాల నుండి ఐదేళ్ల లోపు చిన్నారులకు విటమిన్ ఏ ద్రవం (చుక్కలు) వేశారు. వారు మాట్లాడుతూ విటమిన్ ఏ లోపం వల్ల చిన్నారులు చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతి తల్లీ తమ చిన్నారులకు విటమిన్ ఎ చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎమ్ గీ. స్వరూప, అంగన్వాడీ టీచర్స్ లత దేవి, పద్మ, అంజలి, సునంద, ఆశలు సునీత, లింగవ్వ, సుగుణ తదితరులు పాల్గొన్నారు.