రిజర్వ్ లో ఉన్న కంట్రోల్ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ పూర్తి – కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

పెద్దపల్లి,(సిరా న్యూస్);
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రిజర్వ్ లో ఉన్న కంట్రోల్ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ కట్టు దిట్టంగా పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి రిజర్వ్ కంట్రోల్ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా రిజర్వ్ కంట్రోల్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్ లైన్ విధానం ద్వారా చేపట్టినట్లు తెలిపారు. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గానికి 67 కంట్రోల్ యూనిట్లు, మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి 83, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి 83 కంట్రోల్ యూనిట్లు ర్యాండమైజేషన్ ప్రక్రియతో కేటాయించా మని అన్నారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఏ ఈవిఎం యంత్రం ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో వెళ్తుందో ఆన్ లైన్ ఎన్నికల కమిషన్ రూపొందించిన సాఫ్ట్ వేర్ మాత్రమే నిర్దేశిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎం యంత్రాన్ని ఇతరులు కంట్రోల్ చేయడం కుదరదని అన్నారు. కంట్రోల్ యూనిట్ సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ సంబంధించి హర్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రకాష్, డి.టి. షఫీ, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *