Collector Rahul Raj :పార్లమెంట్ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి
*ఎన్నికల సంఘం సూచించిన నియమాలు పాటించాలి
*జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక టీటీడీసీ హాల్ లో సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్ నియోజకవర్గాలకు చెందిన అధికారులతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన అధికారులు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను చేపట్టాలని అన్నారు. ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పిఓ, ఏపిఓ, సెక్టోరల్ అధికారులకు శిక్షణ లను అందించాలని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు అసెంబ్లీ సెగ్మెంట్లలో వుంటాయని, రిషిప్షన్ కేంద్రాలు ఆదిలాబాదులోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్సిల్ పాఠశాల, సంజయ్ గాంధీ పాల్ టెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం సూచించిన నియమాలు తూ.చ. తప్పకుండా పాటించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.అనంతరం సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్సిల్ పాఠశాల, సంజయ్ గాంధీ పాల్ టెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఖుష్భు గుప్త, దీపక్ తివారి, ఆయా నియోజక వర్గాల అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *