కీసర,(సిరా న్యూస్);
మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బాగంగా బీజేపీ పార్టీ తలపెట్టిన సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా కేంద్ర ప్రభుత్వ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్హాజరయ్యారు. ఆయనతో పాటు మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు హాజరయ్యారు. ఈసందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని, తాను చేసిన సేవలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనన్నారు. మంత్రి మల్లారెడ్డి కబ్జాలకు అంతేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసి బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని తెలిపారు. 10సంవత్సరాల నుండి తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. 27 సంవత్సరాలుగా గుజరాత్ ను దేశంలోనే ఒక మాడల్ గా అభివృద్ధి చేశామని, ఇక్కడఎందుకు అభివృద్ధి చెందలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే కుటుంబపాలనకువ్యతిరేకంగాపనిచేస్తుందన్నారు. అటల్ బిహారీ వాజపేయి నుండి, మోడీ వరకు బీజేపీ ప్రభుత్వాలు నాయకులపై ఏ ఒక్క అవినీతి మచ్చ లేదని అన్నారు. కుంబానికి ఒక్క ఉద్యోగం ఇస్తానని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వంఇస్తామని మోసం చేసి పేపర్ లీకేజీలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని ఏ ఒక్క దలితునికి ఇవ్వలేదన్నారు. 10 లక్షల దళితబంధు ఎవరికీ ఇవ్వలేదన్నారు.