హనుమాన్ నయా రికార్డ్..

సిరా న్యూస్,హైదరాబాద్;
సౌత్ ఇండియన్ సినిమాలకు నార్త్ ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. కథ, మేకింగ్ బాగుంటేనే హిందీ ప్రేక్షకులు సౌత్ సినిమాలను ఆదరిస్తారు. గతంలో ‘బాహుబలి’, ‘కేజీఎఫ్ చాప్టర్ 1’, ‘ఆర్ఆర్ఆర్’లాంటి సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. ఇప్పుడు తెలుగు ‘ హనుమాన్ ‘ సినిమా కూడా నార్త్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. హిందీ డబ్‌గా విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ సైడ్ అయినా కూడా హనుమాన్ సినిమా ఇప్పటికీ దూసుకుపోతుంది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా 300కోట్లకు పైగా వసూల్ చేసిరికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన హనుమాన్ అన్ని భాషల్లో మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటికే చాలా రికార్డ్ క్రియేట్ చేసిన హనుమాన్ తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఓ స్టార్ హీరో సినిమాను బీట్ చేసింది హనుమాన్.మార్కెట్‌లో గతంలో ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ రికార్డును ‘హనుమాన్’ బద్దలు కొట్టింది హనుమాన్. ‘రాకింగ్ స్టార్’ యష్ నటించింది ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ చిత్రం హిందీలోకి డబ్ చేశారు. హిందీ వెర్షన్ నుంచి ఆ సినిమా 44 కోట్ల వరకు వసూల్ చేసింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని ‘హనుమాన్’ సినిమా అధిగమించింది. హిందీలో డబ్ అయిన ‘హనుమాన్’ సినిమా 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇప్పటికీ చాలా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది హనుమాన్.తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాలో అతను సూపర్ హీరోగా కనిపించాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఆంజనేయుడి నుంచి సూపర్ పవర్స్ పొందే ఓ సామాన్యుడి కథతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.300 కోట్లుకు పైగా వసూలు చేసింది. తేజసరసన అమృత అయ్యర్‌తో నటించింది. కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. అలాగే కీలక పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ మెరిసింది. వినయ్ రాయ్ విలన్ రోల్ అందరినీ ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *