MPDO Ravindranath: జైనథ్ ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన ఏ రవీంద్రనాథ్…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

జైనథ్ ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన ఏ రవీంద్రనాథ్…

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల పరిషత్ ఎంపీడీవో గా ఏ రవీంద్రనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవో గా పనిచేసిన గజానన్ రావు నిర్మల్ జిల్లా కు బదిలీ కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ ఎంపీడీవో జైనథ్ కు బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించి, మండల పరిషత్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండల భౌగోళిక స్వరూపం, రాజకీయ పరిస్థితులు, ప్రజా జీవన విధానం, ఆర్థిక స్థితిగతులు, తదితర అంశాల గురించి మండల పరిషత్ సూపరింటెండెంట్ ముత్యం రావు ను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *