భార‌తీయ నేవీ అధికారుల మరణ శిక్ష పై భార‌త స‌ర్కార్ స‌వాల్ పిటీష‌న్‌ను విచార‌ణ‌కు అంగీక‌రించిన ఖ‌తార్ కోర్టు

న్యూఢిల్లీ ,(సిరా న్యూస్);
భార‌తీయ నేవీకి చెందిన 8 మందికి ఖ‌తార్ కోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించిన విష‌యం తెలిసిందే. ఆ శిక్ష‌ను స‌వాల్ చేస్తూ భార‌త స‌ర్కార్ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను ఖ‌తార్ కోర్టు విచార‌ణ‌కు అంగీక‌రించింది.అయితే త్వ‌ర‌లోనే ఆ కేసు విచార‌ణ తేదీని కోర్టు ప్ర‌క‌టించ‌నున్న‌ది. గూఢ‌చ‌ర్యం కింద ఖ‌తార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆగ‌స్టు 2022లో 8 మందిని అరెస్టు చేసింది. కానీ ఖ‌తార్ ప్ర‌భుత్వం మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ఆరోప‌ణ‌లు చేయ‌లేదు. అనేక సార్లు బెయిల్ పిటీష‌న్‌ను పెట్టుకున్నా.. ఖ‌తార్ స‌ర్కార్ వాటిని తిర‌స్క‌రించింది. అరెస్టు అయిన‌వారిలో క‌మాండ‌ర్ పూర్ణేందు తివారి, క‌మాండ‌ర్ సుగుణాక‌ర్పాకాల‌, క‌మాండ‌ర్ అమిత్ నాగ్‌పాల్‌, క‌మాండ‌ర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ న‌వ‌తేజ్ సింగ్ గిల్‌, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వ‌ర్మ‌, కెప్టెన్ సుర‌భ్ వాసిత్‌, సెయిల‌ర్ రాగేశ్ గోపాకుమార్ ఉన్నారు. అరెస్టు అయిన నేవీఆఫీస‌ర్లు అంద‌రూ దాదాపు 20 ఏళ్ల పాటు స‌ర్వీస్‌లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *