సిరా న్యూస్,అమరావతి;
రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ పై హై కోర్టు స్టే ఇచ్చింది. రాజధాని సినిమా ఆపి వేయాలని ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. దాంతో స్టే ఇచ్చి గురువారం విచారించనున్నది. ఈ సినిమా మీద అభ్యంతరాల సంబంధించి అంశాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇక రాజధాని ప్రజల కష్టాలను సినిమా రూపంలో చూపించేందుకు రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా రూపొందించారు. మొత్తానికి ఏపీలో రాజకీయ సినిమాలు వివాదాస్పదంగా మారుతున్నాయి…