సిరా న్యూస్,ములుగు;
మేడారం మహాజాతర ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి అయింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా సమ్మక్క సారక్క సన్నిధిలో ప్రమాణ స్వీకారం జరిగింది. సమ్మక్క సారక్క దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఉత్సవ కమిటీ బాధ్యతలు స్వీకరంచింది. ఉత్సవ కమిటీ చైర్మన్ గా అర్రెం లచ్చు పటేల్, 14 మంది సభ్యులతో కూడిన కమిటీ ప్రమాణ స్వీకారం చేసారు. జాతర విజయవంతం చేసేలా కృషి చేయాలని కమిటీకి మంత్రి సీతక్క సూచించారు.