కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో సామాజిక న్యాయం జీవన్ రెడ్డి విజయానికి సీపీఐ నేతల కృషి

జగిత్యాల,(సిరా న్యూస్);
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అన్ని వర్గాలకు మేలు చేసేవిధంగా ఉన్నాయని అందుకు ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేయాలని జగిత్యాల జిల్లా సీపీఐ కార్యదర్శి వెన్న సురేష్ పిలుపు నిచ్చారు.
శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల కరపత్రాలను ఓటర్లకు ఇస్తూ దానిలో ఉన్న అంశాలను వివరిస్తూ కాంగ్రేస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని సీపీఐ నాయకులు కోరారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వెన్న సురేష్ మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీతో సీపీఐ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందని, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకర్గాల్లో పోటీ చేస్తున్న కాంగ్రేస్ అభ్యర్థుల గెలుపుకోసం మా వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బలపరుస్తున్న జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని సురేష్ కోరారు..
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు సామాజిక న్యాయానికి ప్రత్యేకగా ఉన్నాయని, ప్రధానంగా మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడం వారి ఆర్థిక స్వలంబనకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
కౌలు రైతులకు, రైతు కూలీలకు ప్రకటించిన గ్యారెంటీలు వారికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని కల్పించే విధంగా ఉన్నాయని సురేష్ పేర్కొన్నారు.ముఖ్యంగా పేదవారి కల సొంత స్థలము అలాగే ఇంటి నిర్మాణానికి 5లక్షలు కాంగ్రెస్ గ్యారంటీలో పొందుపరచడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *