సిరా న్యూస్, పెంబి:
ప్రతి ఒక్కరూ చేయి గుర్తుకు ఓటు వేసి ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జును భారీ మెజారిటీతో గెలిపించాలని, జవహర్ బాల మంచ్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తులాల శంకర్, పెంబి గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు గుగ్గిళ్ల భూమేష్ అన్నారు. పెంబి మండలంలోని ఆక్టోనిమాడ గ్రామంలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని వారు అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అందరికీ రుణమాఫీ, నిరుద్యోగ భృతి, వంటి పథకాలు కేవలం పేర్లకే పరిమితమయ్యాయని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. ఖానాపూర్ అభివృద్ధి వెడ్మా బొజ్జు పటేల్ తోనే సాధ్యమని, ప్రతి ఒక్కరు తమ ఓటును ఆయనకు వేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు స్వప్నిల్ రెడ్డి , తొకల మహేందర్, కృష్ణమచారి, భూక్యా సుభాష్, తులాల శంకర్, గుగ్గిల భుమేశ్, గోదురి భూమేశ్, దేశాబోయిన వెంకటేష్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.