సిరా న్యూస్,హైదరాబాద్;
ట్రాన్స్పోర్ట్ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరును నిరసిస్తూ ఈరోజు హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తా వద్ద ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు ఎంతో నష్టపోతున్నారని వారు వాపోయారు తక్షణమే ఉచిత ప్రయాణ బస్సును రద్దుచేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. ఉచిత బస్ హామీతో ఉపాధి కోల్ పై ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆర్థిక సాయం అందించాలని వారు డిమాండ్ చేశారు.తక్షణమే ఆటో మోటార్ రవాణా కార్మికులకు ఈఎస్ఐ తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు