సిరా న్యూస్, జైనథ్:
బిజెపి పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్ శంకర్ ఆధ్వర్యంలో జైనథ్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్ యాదవ్, ఇతర యువజన సంఘాల సభ్యులు బిజెపి పార్టీలో చేరారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాయల్ శంకర్, లక్ష్మణ్ యాదవ్, బండి రవి యాదవ్, సాయికిరణ్, కొంగల మహేందర్, అనిల్, యువజన సంఘాల సభ్యులకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్రానికి మోడీ నాయకత్వం అవసరం ఉందని ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పాయల్ శంకర్ ను ఎమ్మేల్యే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం పాయల్ శంకర్ మాట్లాడుతూ… నేడు గ్రామ గ్రామాన యువత బిజెపి పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందని ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.