రెడీ అవుతున్న తేజస్ మార్క్ 2.

బెంగళూరు, (సిరా న్యూస్);
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. హెచ్ఏఎల్ సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ స్వదేశీ యుద్ధ విమాన తేజస్-మార్క్ 2 తయారీ కేంద్రాన్ని సమీక్షించనున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవల 12 సూ -30 ఎంకేఐ  యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి హెచ్ఏఎల్  కు టెండర్ జారీ చేసింది. రష్యా పరికరాల తయారీ సంస్థలతో కలిసి హెచ్ఏఎల్ భారత్లో వీటిని తయారు చేయనుంది.వచ్చే నెలలోగా ప్రాజెక్టు వివరాలతో టెండర్పై ప్రభుత్వ రంగ సంస్థ స్పందిస్తుందని డిఆర్డీవో  చీఫ్ డాక్టర్ సమీర్ వి కామత్ అన్నారు. స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA), ఎల్ సీయే -మార్క్ 2 మొదటి రెండు స్క్వాడ్రన్ల ఇంజిన్లను దేశీయంగా ఉత్పత్తి చేస్తామని సమీర్ వి కామత్ చెప్పారు.ఇటీవల భారత్ రక్షణ రంగంలో గొప్ప విజయాన్ని సాధించింది. స్వదేశీ యుద్ధ విమానం తేజస్-మార్క్ 2 ఇంజిన్ దేశంలోనే రూపుదిద్దుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *