సిరా న్యూస్,కరీంనగర్;
బీజేపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారా.. కొన్ని రోజులుగా పార్టీలోసర్దుకు పోతున్న ఆయన అధికార కాంగ్రెస్‌వైపు చూస్తున్నారా.. గత కొద్దిరోజులుగా మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా.. హస్తం గూటికి చేరేందుకుముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారా అంటే అవునే సమాధానం వస్తోందికాంగ్రెస్ వర్గాల నుంచి. కరీంనగర్‌లో బీజేపీ జాతీయ కార్యదర్శి బండిసంజయ్, ఈటల రాజేందర్‌కు మధ్య పొసగడం లేదని చాలాకాలంగా ప్రచారంజరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని బండి ఇటీవల ఖండించారు. కానీ అనుచరులుమాత్రం వర్గాలుగా విడిపోయారు. ఇక మరోవైపు బీజేపీ తరఫున 2023 అసెంబ్లీఎన్నికల్లో ఈటల రాజేందర్ హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసిఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి సీటు ఆశిస్తున్నారు. అయితేమల్కాజ్‌గిరి టికెట్ ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదని
సమాచారం.మల్కాజ్‌గిరి టికెట్‌ను బీజేపీ నిరాకరించడంతో తనకు బలమైనక్యాడర్ ఉన్న కరీంనగర్ ఎంపీ టికెట్ ఇవ్వాలని ఈటల కోరుతున్నారు. ఇక్కడకూడా బండి సంజయ్‌ను కాదని ఇతరులకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని కమలనాథులుక్లారిటీ ఇచ్చారు. దీంతో ఈటల బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఈనేపథ్యంలోనే ఆయన పార్టీ మారతారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా
ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైందని, పార్టీ మారేందుకు ముహూర్తం కూడాఫిక్స్ చేసుకున్నారని వార్తలు మరోమారు చెక్కర్లు కొడుతున్నాయి. ఈమేరుఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావు, పట్నంమహేందర్‌రెడ్డి ఈటలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ముగ్గురూ సమావేశమయ్యారని తెలుస్తోందికరీంనగర్ ఎంపీగా పోటీచేసేందుకు కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు లేడు. దీంతో ఈటలను కాంగ్రెస్‌లోచేర్చుకుని ఎంపీగా పోటీ చేయించాలని హస్తం నేతలు భావిస్తున్నారు. గతంలోపొన్న ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా గెలిచారు. తర్వాత బోయినపల్లి వినోద్‌బీఆర్‌ఎస్ నుంచి బండి సంజయ్ బీజేపీ నుంచి గెలిచారు. తాజాగా పొన్నంప్రభాకర్ హుస్నాబాద్‌కు మారారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు.కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంత రావు, మాజీ మంత్రి పట్నంమహేందర్‌రెడ్డితో బీజేపీ నేత, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్భేటీ అయ్యారు. ఒక చోట కలిసి ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. కాంగ్రెస్నేతలతో ఈటల రాజేందర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.కొద్దీ రోజులుగా ఈటల రాజేందర్ బీజేపీ హైకమాండ్ మీద అసంతృప్తితో ఉన్నారనిఅంటున్నారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన టిక్కెట్అడుగుతున్నారు. కానీ హైకమాండ్ ఏదీ తేల్చడం లేదు. ఈటల రాజేందర్ మాత్రంఇవేవి పట్టించుకోకుండా మల్కాజ్‌గిరిలో ప్రజలకు చేరువయ్యేందుకుప్రయత్నిస్తున్నారు.
వివిధ కార్యక్రమాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూఅధిష్టానానికి సంకేతాన్ని పంపుతున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకుఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఈటల ఫర్
మల్కాజ్‌గిరి’ క్రికెట్ ట్రోఫీని ఆయన అనుచరులు స్టార్ట్ చేశారు. అయితేదీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా స్వయంగా తన నివాసంలో ఈటల రాజేందర్రిలీజ్ చేశారు. ఈటలకే మల్కాజ్‌గిరి టికెట్ రాబోతున్నట్లు ఆయన అనుచరులుచెబుతున్నారు. దీంతో మరోసారి ఈటల దుమారం తెరపైకి వచ్చింది. ఎంపీగా పోటీపైబీజేపీ అధిష్టానం నిర్ణయం కంటే ముందే అనుచరుల పేరుతో తానేకార్యక్రమాలుఏర్పాటు చేస్తున్నారని పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.అంశంపైపార్టీ నేతలు హైకమండ్ కు పిర్యాదులు చేశారు. ఇప్పటికి హైకమాండ్ ఎలాంటినిర్ణయం తీసుకోలేదు. గతంలో ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినా పార్టీపరిస్థితి మెరుగుపడలేదు. ఈటల సూచనల మేరకే బీసీ సీఎం నినాదాన్నిఅందుకున్నారని కూడా అంటున్నారు.