ఇమేజ్ కోసం గులాబీ యత్నాలు
సిరా న్యూస్,హైదరాబాద్;
రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది అద్భుతమైన ఆయుధం.. అధికారాన్ని ఇట్టేతెచ్చి పెడుతుంది. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితిగా మారిన భారత రాష్ట్రసమితి నేతలకు ప్రత్యేకమైన అనుభవం ఉంది. అయితే ఆ విషయంలోనే వారుతప్పటడుగులు వేశారన్న అబిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆ విషయం పక్కనపెడితే.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ప్రత్యేకమైన వ్యక్తిగాగుర్తుంచుకోవాలన్న మిషన్ ను బీఆర్ఎస్ ప్రారంభించింది. ఆయనను తెలంగాణబాపుగా ప్రసిద్ధి చేసేందుకు పుట్టిన రోజు వేడుకల కేంద్రంగా ప్రయత్నాలుప్రారంభించింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతిపిత బాపూ అంటూ సరికొత్తప్రచారాన్ని ప్రారంభించారు తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదినం సందర్భంగా శనివారం ఆయననేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాతిపిత బాపూ పేరిట సరికొత్తప్రచారం సాగించారు.
తెలంగాణలో ఓటమి పాలవడంతోపాటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కాళేశ్వరం నుంచి కృష్ణ జలాల వరకు విమర్శల వర్షం కురుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రతిష్ఠ పెంచేందుకు బీఆర్ఎస్ నాయకులుబాపూ ప్రచారంతో ముందుకు వెళుతున్నారు. తెలంగాణ సిద్ధించిన పదేళ్ల తర్వాతకూడా మళ్లీ తాజాగా తెలంగాణ సెంటిమెంటును రగిలిస్తున్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా, బాపూ అనిపిలవడం ఆయనకు మనం ఇచ్చే గౌరవమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిచెప్పారు. తెలంగాణలో గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీని మాత్రమే బాపూ అని
పిలిచే వారు. కానీ ప్రస్థుతం ఆ బాపూ పేరును కేసీఆర్ కు కొత్తగాచేర్చారు.
కేసీఆర్ 2001వ సంవత్సరం ఏప్రిల్ 7వతేదీన తెలంగాణ రాష్ట్రసమితిని స్థాపించారు. తెలంగాణ బతుకులు…బొగ్గుబాయి, బొంబాయి.. దుబాయిఅన్నట్లు తయారైనయ్ అని తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించిన కేసీఆర్ ఓటమిఅనంతరం, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సరికొత్త రాజకీయవ్యూహాలు పన్నుతున్నారు. గతంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా నేతలు ఆయన్నుకలిసి పదవులు పొందేందుకు శుభాకాంక్షలు తెలిపేవారు. సీఎంగా ఉన్నపుడుకేసీఆర్ జన్మదినోత్సవాలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగేవి. కానీ ఈ సారి ఓటమిపాలవడంతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేసీఆర్వేడుకలకు దూరంగా ఉన్నా, ఆ పార్టీ నేతలు మాత్రం మన తెలంగాణ బాపూ అంటూప్రచార హోరు సాగించారు.
కేసీఆర్ బాపూ ప్రచారం శనివారం వాట్సప్, ఫోన్‌కాల్స్ ద్వారా ముమ్మరం చేశారు. కరవు నేలను సిరుల మాగాణం చేసిన ‘‘తెలంగాణబాపు’’ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 జన్మదినం సందర్భంగా ఆయన్ని విష్చేసేందుకు +91 70703 57070 ఫోన్ నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి, ధన్యవాదాలుఅంటూ వాట్సాప్ ద్వారా శనివారం తెలంగాణ వ్యాప్తంగా వాట్సాప్ మెసేజులువచ్చాయి. ఆ ఫోన్ నంబరుకు రింగ్ మిస్డ్ కాల్ చేస్తే చాలు వెంటనే ‘‘ప్రతీతెలంగాణ బిడ్డకు పేరుపేరునా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’అంటూ కేసీఆర్ తన వాయిస్ వినిపించారు.కోట్లమంది కలల తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన మహానాయకుడు, ఉద్యమ నేలనుఉద్యానవనంగా మార్చిన దార్శనికుడు, తెలంగాణ రాష్ట్ర గతిని మార్చి చరిత్ర
లిఖించిన కార్యసాధకుడు మన తెలంగాణ బాపు కేసిఆర్ గారు.
’ ‘‘బాపూ… సబ్బండ
కులాల ఆశాదీపం మీరు, సకల జనుల ఆకాంక్షల ఆలంబన మీరు, నిరాశా నిస్ప్రహలనుతరిమే చైతన్యపు కాగడా మీరు, ఉషోదయాలకు తొలిపొద్దు మీరు, నాడు ప్రాణాలనుఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చింది మీరు’’ వాన్ గార్డ్ ఆఫ్ తెలంగాణ…వెలుగుదివిటి కేసీఆర్ అంటూ ‘‘కుట్రలు, కుతంత్రాలకు, ప్రలోభాలకు లొంగని, జంకనితెలంగాణ పక్షపాతివి…తెలంగాణ పితామహుడు మన తెలంగాణ జాతిపిత బాపూ’’ అంటూబీఆర్ఎస్ నేతలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. కేసీఆర్ 70 వ జన్మదినంసందర్భంగా తెలంగాణ సెంటిమెంటును రగిల్చేలా, కేసీఆర్ ప్రతిష్ఠ పెంచేలాఆడియో, వీడియో పాటల ద్వారా ప్రచారం సాగించారు. ‘‘ఉక్కు గుండెనుఒక్కసారన్నా తాకాలని ఉన్నదే. ఆ బక్కపల్చని పెయ్యి హత్తుకోవాలని ఉన్నదే…ఆ నాటి గురుతులు ఒక్కొక్కటి ఏరుకొని రాశులు పోయాలని ఉన్నదే సావుఅంచులకెళ్లి సాధించే రాష్ట్రాన్ని సారూ కేసీఆర్ చరితను తెలుసుకోవాలనిఉన్నదే మదినిండా తెలుసుకోవాలని ఉన్నదే’’ అంటూపాటలను విడుదల చేశారు.