సద్దుల చెరువు దగ్గర మంత్రి జగదీష్ ప్రచారం

సూర్యాపేట,(సిరా న్యూస్);
సూర్యాపేట అభివృద్ధే తన అభిమతమని.. దేశం  అబ్బురపడెలా డెవలప్ చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తానని మంత్రి, సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం సద్దుల చెరువు ట్యాంక్ బండ్ పై వాకింగ్ చేస్తూ మార్నింగ్ వాకర్స్ తో మంత్రి జగదీష్ రెడ్డి మమేకమయ్యారు. గడిచిన పదేండ్లల్లో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని మంచి చేస్తున్న బీఆర్ఎస్కు అండగా నిలబడాలని కోరారు.చెప్పిందే కాదు చెప్పని పనులను కూడా ఎంతో అభివృద్ధి చేశామన్నారు.సూర్యాపేట  2014 సంవత్సరానికి ముందు, తర్వాత ఒకసారి మనస్సుపెట్టి అలోచించి ప్రజలు చూడాలన్నారు. సూర్యాపేట  దశదిశలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు.  2014 కు ముందు పట్టణవాసులు ఎదుర్కొన్న తాగు, సాగు నీరు విద్యుత్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించానని తెలిపారు. అప్పుడు కంకర తేలిన పట్టణ రహదారులను అద్దంలో మెరిసిపోయేలా చేశానని తెలిపారు.అండగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చిన మంత్రి, మూడో దశ పాలనలో రాబోయే డ్రైపోర్టు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించడం  తొ పాటు సూర్యాపేట ఆర్థికముఖ చిత్రమే మారబోతుందని తెలిపారు. మరోవైపు పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసి పదివేల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *