విశాఖపట్నం,(సిరా న్యూస్);
బీసీ రౌండ్ సమావేశంలో టీడీపీ సీనియ ర్ నేత యనమల రామ కృష్ణుడు మాట్లాడుతూ వైసీపీ సర్కారు పై విమర్శలు గుప్పించారు. ఉత్తరాం ధ్రలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు. వారి సమస్యలపై చర్చించాం. 139 కులాలు ఉన్నాయి. చాలా కులాలు వృత్తి మీద ఆధారపడినవే ఉన్నాయి. ప్రతి కులానికి సమస్యలు ఉన్నాయి. ఆర్థిక, సాంఘిక సమానత్వం బీసీలకు కావాలి. రావాలి. బీసీలకు పొలిటికల్ ఎన్ప వర్మెంట్ కావాలి. బీసీల్లో ఐక్యత అవసరం. బీసీలకు పొలిటికల్ రిజ ర్వేషన్ ఉండాలి. చట్ట సభలో రిజర్వే షన్లు కావాలి. బీసీ జనగణన జరగాలి. టీడీపీ అధికా రంలో వచ్చిన వెంటనే సెన్సెస్ నిర్వహిస్తాం. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంటే…ప్రజలకే నష్టం. వచ్చే బడ్జెట్లో బీసీలకు ఎక్కువ కేటాయింపులు ఉండ డానికే బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. విశాఖకు రాజధాని తెస్తున్నామని చెప్పి.. వైజాగ్ లో భూములు దోచే స్తున్నారని యనమల ఆరోపించారు.