హైదరాబాద్, (సిరా న్యూస్);
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. నవంబర్ 30 జరిగే పోలింగ్ కోసం 377 కంపెనీల కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మరి ఈ ఎలక్షన్స్ ఎన్ని వేల EVMలు వాడుతున్నారు..? ఎంత మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు?దాం. తెలంగాణలో ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. ప్రచారానికి కొన్ని రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులంతా ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. అటు ఎన్నికల సంఘం కూడా తమ పనికూడా పూర్తి చేసే పనిలో పడింది. నవంబర్ 30 జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ఎన్నిలక ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ షురూ అయినట్లు చెప్పారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంతా రెడీ చేస్తున్నట్లు తెలిపారు.ఇక పోలింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ చకచకా సాగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది. తెలంగాణలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువా ఉండటంతో ఓటర్ల స్లిప్పుల పంపిణీ కూడా వేగవంతం చేశారు. రాష్ట్రంలో 36వేల ఈవీఎంలను రెడీ చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ప్రతీ కౌంటింగ్ సెంటర్ లో ఒక అబ్జర్వర్ ఉండనున్నారు.