హైదరాబాద్, (సిరా న్యూస్);
ప్రస్తుతం దేశంలో టాప్ నగరాల్లో ఇళ్ల ధరలు, అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఈ ధరలు 13 నుంచి 33 శాతం వరకు పెరిగాయని తెలుస్తోంది. అన్ని టాప్ సిటీలతో పోల్చుకుంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనే ఎక్కువగా పెరిగినట్లు సమాచారం. అందులో కూడా గచ్చిబౌలి ఏరియాలో ఇళ్ల రేట్లు మరింతగా పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి గచ్చిబౌలిలో చదరపు అడుగు సగటు ధర రూ. 6,355 గా నమోదు అయ్యింది. మూడేళ్ల క్రితం ఇదే నెలలో రూ. 4,790 గా ఉంది. ఇలా ఉంటే కొండాపూర్ లో చదరపు అడుగు రూ. 6,090 గా ఉంది.కేవలం హైదరాబాద్ లోనే కాకుండా బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ఏరియాలో ఇళ్ల రేట్లు గడిచిన మూడు సంవత్సరాలలో భారీగా పెరిగాయి. డిమాండ్ కు తగినట్లుగానే అడుగు ధర రూ.6,325 కి పెరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రాపర్టీల రేట్లు పెరుగుతునే ఉన్నాయి. నిర్మాణ ఖర్చులు పెరగడంతో పాటు ముడి సరుకుల ధరలు కూడా ఎక్కువవ్వడం, ల్యాండ్ ధరలు పెరగడంతో పాటు డిమాండ్ కొనసాగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా ఇళ్లు కొనాలనేకునే వారు పెద్ద ఇళ్లకు ఎక్కువ మక్కువ చూపుతున్నారని తెలుస్తుంది