మంచి పనులు చేసినా చెడ్డోనిగా చిత్రీకరిస్తుండ్లు. -బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని,(సిరా న్యూస్);
మీ ఇంటి బిడ్డగా నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే అనేక మంచి పనులే చేశానని, ఎంతో మందికి సాయం అందించానని అయినా కాంగ్రెస్సోళ్లు తనను చెడ్డోనిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ వాపోయారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోబాగంగా శనివారం మంథని మండలం ఖానాపూర్‌ గ్రామంతో పాటు పలు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఎమ్మెల్యేగా, ఈనాడుజెడ్పీ చైర్మన్‌గా ఖానాపూర్‌ గ్రామానికి అనేక అభివృధ్ది చేశానని గుర్తు చేశారు. మంథని నుంచి ఎల్‌మడుగు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో ఇప్పటికే బండ్ల మడుగు దాకా రోడ్డు వేశామన్నారు. అలాగే నల్లవాగుపై కల్వర్టు నిర్మించి రైతుల కష్టాలు తీర్చామన్నారు. ఇలాంటి అభివృధ్ది పనులే కాకుండా ఎంతో మంది పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు, విద్యార్దుల చదువులు, ఆస్పత్రులకు సాయం, మధ్యాహ్న బోజనాలు పెట్టి విద్యార్ధుల ఆకలి తీర్చామని ఆయన తెలిపారు. అనేక సేవలు, అభివృధ్ది పనులు మీ కళ్ల ముందే కన్పిస్తుంటే కాంగ్రెస్సోళ్లు మాత్రం వంద అంబండాలు వేస్తున్నారని అన్నారు. రామగిరి మండలానికి చెందిన ఓ బీద బిడ్డను ప్రజాప్రతినిధిని చేసి అందలం ఎక్కిస్తే ఈనాడు తాను బెదిరింపులకు గురి చేశానని, తనవద్ద రికార్డులు ఉన్నాయంటూ మీడియా ముందు చెప్పిందని, ఈనాటి వరకు ఆ రికార్డులను బయటకు తీసుకురాలేదని అన్నారు. అంతేకాకుండా వంద అంబండాలు వేసినోళ్లు ఒక్కటి కూడా నిరూపించలేకపోయారన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *