శ్రీకాకుళం,(సిరా న్యూస్);
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి కాశిబుగ్గ బస్టాండ్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన వేళ దొంగలు బీభత్సం సృష్టించారు. సుమారు పది షాపుల్లో తాళాలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. పలు షాపుల్లో ఉన్న నగదు దూసుకెళ్లినట్లు బాధితులు కాశిబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు.