జగ్గయ్యపేట,(సిరా న్యూస్);
జె.అన్నవరం, బలుసుపాడు తదితర గ్రామాల నుంచి చైతన్య స్కూల్ కి విద్యార్దులను తీసుకు వస్తున్న బస్సు లో మంటలు చేలరేగాయి. క్రిస్టియన్ పేట సమీపంలోకి రాగానే బస్సు నుంచి పొగలు రావటంగమనించిన డ్రైవర్, బస్సును పక్కకు నిలిపి వేసాడు. బస్సులో సుమారుగా 40 మంది పిల్లలను స్థానికులు హుటాహుటిన కిందకు దింపారు. ఇంజన్ లో వైర్లు షార్ట్ సర్క్యూట్, సీఎన్జీ గ్యాస్ లీక్ కావడంతోఅగ్ని ప్రమాదం సంభవించినదా! ఆని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు నీళ్లు తెచ్చి పోసారు.జనసంచారం ఉండడంతో సురక్షితంగా విద్యార్దు క్షేమంగా బయటపడ్డారు. అదే ఊరు బయట జనసంచారం లేని ప్రదేశంలో అయితే ఏమై ఉండేదో నని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానిక మహిళలు.డ్రైవర్ మంటల నుండి పిల్లలను కాపాడే సమయంలో స్వల్పంగా చర్మం కాలింది.