హుజురాబాద్ లో హస్తం గెలుస్తుంది —-
మాయమాటలతో ఓటర్ల చెవిలో పువ్వులు పెట్టడానికి పువ్వు, కారు పార్టీలు వస్తున్నాయి….
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్
హుజురాబాద్,(సిరా న్యూస్);
మాయమాటలతోప్రజలను మోసం చేసేందుకు వస్తున్న పువ్వు పార్టీలను నియోజకవర్గం నుండి తరిమికొట్టాలని గతంలో కల్లిబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన బిఆర్ ఎస్ ,బజాపా ఎర్రి పుష్పాలను ఏరిపారేయాలని జమ్మికుంట ప్రజలకు విజ్ఞప్తి చేశారు .శనివారం రోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోతులగూడెం , అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వోడితెల ప్రణవ్ బాబు మాట్లాడుతూ బిఆర్ఎస్ ,బిజెపి పార్టీలపై ధ్వజమెత్తారు .నియోజకవర్గం లోని ప్రజలందరి కష్టాలలో తోడుంటా హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ కష్టసుఖాలలో పాలుపంచుకుంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్ బాబు ప్రజలకు హామీనిచ్చారు .ప్రణవ్ బాబు రాకను స్వాగతించిన గ్రామస్తులు ప్రణవ్ కు డప్పుచప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలు చేస్తూ గ్రామ ప్రజలు గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు .కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అభివాదం చేశారు