మంత్రి హరీష్ రావు
మహబూబాబాద్,(సిరా న్యూస్);
మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఎమ్యెల్యే అభ్యర్ధి శంకర్ నాయక్కి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో త్రి హరీశ్ రావు పాల్గోన్నారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల మీటింగులు చూస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నయిబీఆర్ఎస్ మీటింగ్ అంటే జన సముద్రంలా ఉన్నయని అన్నారు. సమైక్య వాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారు. మానుకోటకు మట్టికి దండం మానుకోట రాళ్లకు దండం. మానుకోట దెబ్బతో సమైక్య వాదులు వెనుకకు పరిగెత్తారు. మళ్లీ సమైక్యవాదులు ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తుండ్రు. వారికి మన మానుకోట దమ్మేంటో చూపించాలని అన్నారు.