రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తాం
-ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు
మంథని.(సిరా న్యూస్);
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే చిన్న కాళేశ్వరాన్ని పూర్తి చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
శనివారం మంథని నియోజకవర్గ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలములోని మర్రిపెల్లి ప్రతపగిరి , బొప్పరం,శ్రీనివాసపల్లి,ధంతలపల్లి గ్రామలలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ రాగానే సన్న బియ్యం, అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రైతు భరోసాగా 2 లక్షల రుణమాఫీ, ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఏకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు 500 బోనస్, గృహ జ్యోతి క్రింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, యువ వికాసం క్రింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలోతెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ వృద్ధులకు వితంతులకు 4000 నెలవారీ పింఛన్,10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ప్రతినెల 4 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు.